ఈనాడు ప్రతిభ బ్లాగ్- స్వాగతం

18-Feb-2017

తెలంగాణ గురుకులాల్లో ఉద్యోగాలు

 

Posted by:  ఈనాడు - ప్రతిభ


తెలంగాణ గురుకులాల్లో ఉపాధ్యాయ ఉద్యోగాల కోసం భారీ ప్రకటన వెలువడింది. దీంతో సంవత్సరాలుగా ఎదురు చూస్తున్న అభ్యర్థుల్లో ఆనందం వెల్లువెత్తింది. ప్రిన్సిపల్, పీజీటీ, టీజీటీ, ఆర్ట్ టీచర్, క్రాఫ్ట్ టీచర్, మ్యూజిక్ టీచర్, పీఈటీ, పీడీ, లైబ్రేరియన్లతోపాటు ఇతర పోస్టుల ఖాళీలు నోటిఫికేషన్ లో ఉన్నాయి. తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ కు పరీక్ష నిర్వహణ బాధ్యతలు అప్పగించారు. కొన్ని ఉద్యోగాలకు రెండు దశల్లోనూ, మరికొన్నింటికి ఒక దశలోనూ రాత పరీక్షలు జరుగుతాయి. పరీక్ష ఇంగ్లిష్ మీడియంలో జరుగుతుంది. తెలుగు మీడియం అభ్యర్థులు కూడా పరీక్ష రాయడానికి అర్హులే. ప్రాథమిక పరీక్షకు తక్కవ సమయమే ఉంటుంది. అందుకే అభ్యర్థులు సమయం కొంచెం కూడా వృథా చేయకుండా అధ్యయనం సాగించాలని నిపుణులు పేర్కొంటున్నారు. అర్హతల్లో మార్పులు చేస్తూ పూర్తి నోటిఫికేషన్ త్వరలో విడుదల కానుంది. ఉపాధ్యాయ ఉద్యోగాలు సాధించాలనుకునే వారికి ఇది గొప్ప అవకాశం.

క్లిక్ చేయండి
Tags:Gurukula, Principal, PGT, TGT, JL, Arts teacher, Crafts TeacherADD A COMMENT


 

  

 

copyright © Ushodaya Enterprises Private Limited 2016