ఈనాడు ప్రతిభ బ్లాగ్- స్వాగతం

11-Jan-2017

మంచి పోస్టులతో గ్రూప్-1 నోటిఫికేషన్

 

Posted by:  ఈనాడు - ప్రతిభ


ఏపీపీఎస్సీ ఎట్టకేలకు గ్రూప్-1 ఉద్యోగాల కోసం కొత్త నోటిఫికేషన్ విడుదల చేసింది. 2011 నాటి గ్రూప్-1 వివాదాలు కొనసాగడం, మళ్లీ పరీక్ష పెట్టడం వంటి సమస్యలతో ఇప్పుడప్పుడే గ్రూప్-1కి మళ్లీ నోటిఫికేషన్ రాదేమోనని అభ్యర్థులు ఆందోళనలో ఉన్నారు. ఈ ప్రకటన మళ్లీ వారిలో ఉత్సాహాన్ని నింపింది. పోస్టుల సంఖ్య తక్కువగా 78 మాత్రమే ఉన్నప్పటికీ మంచి క్యాడర్ పోస్టులు ఉన్నాయి. డిప్యూటీ కలెక్టర్లు, కమర్షియల్ టాక్స్ ఆఫీసర్లు,  జిల్లా రిజిస్ట్రార్, డీఎస్పీలు, అసిస్టెంట్ ప్రొహిబిషన్ అండ్ ఎక్సైజ్ సూపరింటెండెంట్, బీసీ వెల్ఫేర్ ఆఫీసర్, మున్సిపల్ కమిషనర్, అసిస్టెంట్ లేబర్ కమిషనర్ పోస్టులు ఉన్నాయి. ఇవి చాలామందికి కలల ఉద్యోగాలు. సంవత్సరాలుగా అభ్యర్థులు ఈ ఉన్నతస్థాయి పోస్టుల కోసం ఎదురు చూస్తున్నారు. మే 7న ప్రిలిమినరీ పరీక్ష నిర్వహించాలని కమిషన్ నిర్ణయించింది. ఆగస్టులో మెయిన్ పరీక్షను జరుపుతారు.

సమయం తక్కువగా ఉంది. ప్రాథమిక పరీక్షకు సిద్ధం అవుతూనే, మెయిన్ పరీక్షకు కూడా సిద్ధం కావాలని నిపుణులు సూచిస్తున్నారు. ఒక్కసారే దాదాపు 20 నోటిఫికేషన్లను ఆంధ్రప్రదేశ్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ విడుదల చేసింది. ఒకటి కంటే ఎక్కువ ప్రకటనలకు చాలామందికి అర్హత ఉంటుంది. తమకు ఇష్టమైన ఒకదానిపైనే పూర్తి దృష్టిని కేంద్రీకరిస్తే మంచిదని నిపుణులు పేర్కొంటున్నారు. అభ్యర్థులు తమ శక్తి సామర్థ్యాలను, ఇప్పటికే పూర్తిచేసిన ప్రిపరేషన్ స్థాయిని పరిగణనలోకి తీసుకొని ఎన్ని పరీక్షలకు హాజరు కావాలో నిర్ణయించుకోవాలని, అనసరమైన ఆందోళనకు గురై ఇబ్బంది పడకూడదని చెబుతున్నారు. ఏ ప్రిపరేషన్ పూర్తిగా కొనసాగించలేక చివర్లో కంగారు పడే అవకాశం ఉందని నిపుణులు హెచ్చరిస్తున్నారు. తగిన ప్రణాళికతో అధ్యయనం సాగించి విజయం సాధించాలని కోరుకుంటున్నారు.

క్లిక్ చేయండి
Tags:APPSC Group1, Prelims, Mains, Preparation


Comments

Prasad
BagundiADD A COMMENT


 

  

 

copyright © Ushodaya Enterprises Private Limited 2016