ఈనాడు ప్రతిభ బ్లాగ్- స్వాగతం

24-Dec-2016

చదవాలి... ప్రాక్టీస్ చేయాలి

 

Posted by:  ఈనాడు - ప్రతిభ


ఏపీపీఎస్సీ గ్రూప్-2 కి అభ్యర్థులందరూ సీరియస్ గా ప్రిపేర్ అవుతున్నారు. ఆరున్నర లక్షలపైగా  దరఖాస్తులు కమిషన్ కు చేరాయి. ముందుగా ప్రాథమిక పరీక్ష (స్క్రీనింగ్ టెస్ట్) జరుగుతుంది. ఇందులో కరెంట్ అఫైర్స్, ఇండియన్ పాలిటీ, ఇండియన్ ఎకానమీ నుంచి ప్రశ్నలు వస్తాయి. వివరణాత్మకంగా చదవాలా? బిట్లు ప్రాక్టీస్ చేయాలా? అని అభ్యర్థులు తర్జన భర్జన పడుతున్నారు. రెండూ చేయాలి, ఏ ఒక్కటి చేసినా ఇబ్బంది పడాల్సి ఉంటుంది అని నిపుణులు పేర్కొంటున్నారు. కేవలం బిట్లు చదవడం వల్ల త్వరగా మరచిపోవడానికి అవకాశాలు ఉన్నాయి. అందులోనూ వర్తమానాంశాలు, భారత రాజకీయ వ్యవస్థ, భారత ఆర్థిక వ్యవస్థ వంటి సబ్జెక్టులు చదివేటప్పుడు ఎన్నో గణాంకాలను, సంఘటనలను గుర్తుంచుకోవాల్సి వస్తుంది. బిట్ల రూపంలో వాటిని చదవడం వల్ల గుర్తుంచుకోవడం కష్టం అవుతుంది. పైగా అనువర్తన కోణంలో ప్రశ్నలు వస్తే జవాబులు గుర్తించడంలో అభ్యర్థులు ఇబ్బంది పడే అవకాశం ఉంది. అందుకే ముందుగా మౌలికాంశాలపై పట్టు సాధించాలి. తర్వాత సిలబస్ ప్రకారం అన్ని విభాగాలను వరుసగా చదవాలి. ఒక విభాగం పూర్తయితే వెంటనే దానికి సంబంధించిన బిట్లు ప్రాక్టీస్ చేయాలి. ఆ విధంగా అన్ని విబాగాలను పూర్తి చేయాలి. కరెంట్ అఫైర్స్ నెలల వారీగా అన్ని అంశాలను అధ్యయనం చేయాలి. వీలైనన్ని ఎక్కువ బిట్లకు సమాధానాలు గుర్తించాలి. ఈ ప్రాక్టీస్ కూడా వీలైనన్ని ఎక్కువసార్లు చేయాలి. సిలబస్ లో ఏ విభాగాన్ని విడిచిపెట్టకుండా చదవాలి. పోటీ ఎక్కువగా ఉన్న నేపథ్యంలో ప్రతి బిట్ కు ఎంతో ప్రాధాన్యం ఉంటుందని అభ్యర్థులు గుర్తించాలని నిపుణులు సూచిస్తున్నారు.

క్లిక్ చేయండి
Tags:APPSC, GROUP-2, CURRENT AFFAIRS, POLITY, ECONOMY


Comments

NARESH
satisfactoryADD A COMMENT


 

  

 

copyright © Ushodaya Enterprises Private Limited 2016