ఈనాడు ప్రతిభ బ్లాగ్- స్వాగతం

19-Nov-2016

ఏపీపీఎస్సీ గ్రూప్-2 ప్రకటనపై అభ్యర్థుల ఆనందం

 

Posted by:  ఈనాడు - ప్రతిభ


ఏపీపీఎస్సీ 982 గ్రూప్-2 కేటగిరీ ఖాళీలతో మంచి నోటిఫికేషన్ ఇచ్చిందని అభ్యర్థులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు. అందులో 253 డిప్యూటీ తాసిల్దార్, 12 మున్సిపల్ కమిషనర్, 96 ఏసీటీవోలు వంటి ముఖ్యమైన పోస్టులు ఉండటం తమకు ప్రేరణాత్మకంగా ఉందని చెబుతున్నారు. ప్రిలిమ్స్ పట్ల కొంత అసంతృప్తిగా ఉన్నప్పటికీ పరీక్షల ప్రిపరేషన్ కు తీవ్రంగా శ్రమిస్తున్నారు. పోటీ తీవ్రంగా ఉంటుందని అందరూ గ్రహించారు. ప్రిలిమ్స్ పట్ల కొందరు భయాన్ని వ్యక్తం చేస్తున్నారు. అంతగా సీరియస్ గా లేని కొందరు సీనియర్ అభ్యర్థుల వల్ల తమకు నష్టం జరిగే అవకాశం ఉందని చెబుతున్నారు. ప్రిలిమ్స్ తో పాటు మెయిన్స్ మూడు పేపర్లకు కూడా అభ్యర్థులు సిద్ధమవుతున్నారు. ఇంటర్వ్యూలు లేకపోవడం పట్ల కూడా పరీక్షార్థులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు. తాము ఎంత కష్టపడితే అంత ఫలితం ఉంటుందని భావిస్తున్నారు. ప్రిలిమ్స్ లో ప్రధానంగా కరెంట్ అఫైర్స్, ఇండియన్ పాలిటీ, ఇండియన్ ఎకానమీ ఉన్నాయి. కరెంట్ అఫైర్స్ ఫరిధి కొంత విస్తృతంగా ఉంది. దీని కోసం సరైన ప్రణాళిక రూపొందించుకొని అధ్యయనం సాగించాలి. పాలిటీ, ఎకానమీ ప్రిలిమ్స్ కోసం చదివినదంతా మెయిన్స్ కు కూడా ఉపయోగపడుతుంది. ఇది తమకు లభించిన మంచి అవకాశమని, తప్పనిసరిగా శక్తివంచన లేకుండా కృషి చేసి విజయం కోసం ప్రయత్నిస్తామని అభ్యర్థులు చెబుతున్నారు.

 

క్లిక్ చేయండి
Tags:APPSC, GROUP-2, Executive Posts, Non-executive postsADD A COMMENT


 

  

 

copyright © Ushodaya Enterprises Private Limited 2016