ఈనాడు ప్రతిభ బ్లాగ్- స్వాగతం

08-Nov-2016

అత్యున్నత బ్యాంకులో అసిస్టెంట్ ఉద్యోగం

 

Posted by:  ఈనాడు - ప్రతిభ


మన దేశంలో అత్యున్నత బ్యాంకు రిజర్వ్ బ్యాంక్.  అంతపెద్ద బ్యాంక్ లో పని చేయడం అంటే ఎంతో గొప్పగా ఉంటుంది. చాలామందికి అదో కల కూడా. ఆ అవకాశాన్ని మరోసారి కల్పిస్తూ ఆర్ బీఐ 610 అసిస్టెంట్ ఉద్యోగాలకు ప్రకటన విడుదల చేసింది. చిన్న వయసులోనే ఈ అసిస్టెంట్ ఉద్యోగాన్ని దక్కించుకుంటే పదవీ విరమణ నాటికి జీఎం స్థాయికి చేరుకోవచ్చు. వారానికి అయిదు రోజులే పని. వాణిజ్య బ్యాంకుల్లో ఉన్నంత పని ఒత్తిడి ఉండదు. ఆర్ బీఐ అనే బ్రాండింగ్ ఉంటుంది. వాణిజ్య బ్యాంకులైతే దేశంలో ఎక్కడైనా పని చేయాల్సి ఉంటుంది. గ్రామీణ ప్రాంతాలు, అటవీ ప్రాంతాలకు కూడా బదిలీ ఉంటుంది. అదే ఆర్ బీఐ అయితే దేశంలోనే ముఖ్యమైన పట్టణాల్లోనే చేయాల్సి ఉంటుంది. డిగ్రీ ఉత్తీర్ణులైన అభ్యర్థులందరూ ఈ పరీక్షకు హాజరు కావచ్చు. నియామకం మూడు దశల్లో జరుగుతుంది. ప్రిలిమినరీ 100, మెయిన్స్ 200, ఇంటర్య్వూ 35 మార్కులకు జరుగుతాయి. మెయిన్స్, ఇంటర్య్వూ మార్కుల ఆధారంగా నియామకాలు జరుగుతాయి. అభ్యర్థులు శక్తివంచన లేకుండా కృషి చే్స్తే మంచి భవిష్యత్తును అందుకోవచ్చు.

క్లిక్ చేయండి
Tags:RBI, Assistants, apex bank


Comments

REVUVIMALA
వెరీ నైస్ ఇన్ఫోర్మషన్ బట్ ఏ గ్రూప్ వాళ్ళుఅయినా అప్లై చేసుకోవచ్చా సర్ADD A COMMENT


 

  

 

copyright © Ushodaya Enterprises Private Limited 2016